శుభకార్యానికి వెళుతుండగా తుమ్మాడని వ్యక్తిపై దాడి

ఖమ్మం జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాము శుభకార్యానికి వెళుతుంటే తుమ్మాడంటూ ఓ వ్యక్తిని కొందరు చితక్కొట్టారు. పందిళ్లపల్లికి చెందిన బొందె సత్యనారాయణ కుటుంబసభ్యులు నలుగురు ఈ నెల 13న కారులో ఓ శుభకార్యానికి బయలుదేరారు. ఇంతలో, అదే వీధిలో ఉంటున్న పప్పుల వీరభద్రం తుమ్మాడు. సరిగ్గా అదే సమయంలో బొందెల సత్యనారాయణ కారు వీరభద్రం ఇంటి ముందుకు వచ్చింది. 

దీంతో, సత్యనారాయణ కుటుంబసభ్యులు తమకు అపశకునం ఎదురైనట్టు భావించారు. వీరభద్రాన్ని అసభ్యపదజాలంతో తిడుతూ దూషించారు. అందరూ మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. దీంతో, బాధితుడు సోమవారం సత్యనారాయణతో పాటూ అతడి భార్య, ఇద్దరు కుమారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకున్నారు.


More Telugu News