సొల్లు కబుర్లు చెబుతున్నాడు: పవన్ కల్యాణ్ పై పేర్ని నాని మండిపాటు
- చంద్రబాబు వల్లే పవన్ కు ప్రాణహాని ఉందన్న పేర్ని నాని
- పవన్‌ది రౌడీ మనస్తత్వమని విమర్శ
- జగన్‌ను ఎదుర్కోవడం ఆయన వల్ల కాదని వ్యాఖ్య
సోమవారం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. అరాచకంగా పాలించిన చంద్రబాబుని ఏనాడైనా పవన్ కొట్టారా? అని నిలదీశారు. ‘‘నారా లోకేశ్ అవినీతిపరుడని గతంలో పవన్ కల్యాణ్ ఆరోపించలేదా? మరి లోకేశ్ ను గుడ్డలిప్పి కొట్టగలిగాడా?’’ అని ప్రశ్నించారు. పవన్‌ది రౌడీ మనస్తత్వమని, అందుకే అలా మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.
చంద్రబాబుతో పొత్తు అనగానే పవన్ వెనకాల కాపులు తిరగడం మానేశారని చెప్పారు. సీఎం అవుతానంటూ.. కాపులను మోసం చేయడం కోసమే పవన్ అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబుతో పవన్ కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌ను ఎదుర్కోవడం పవన్ వల్ల కాదన్నారు.