‘అతిగా ఆలోచించే వ్యక్తి’ అనే ముద్రే నాకు నష్టం చేసింది: రవిచంద్రన్ అశ్విన్
- ఆట పరంగా భరోసా కల్పించానన్న అశ్విన్
- తాను అతిగా ఆలోచించే వాడిని కాదని స్పష్టీకరణ
- ఒకరి గురించి అలా ప్రచారం చేసే హక్కు మరొకరికి లేదని వ్యాఖ్య
దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, ఓ వార్తా సంస్థతో మాట్లాడాడు. తనను అతిగా ఆలోచించే వ్యక్తిగా ముద్ర వేయడమే తనకు చేటు చేసినట్టు చెప్పాడు. ఇతర ఆటగాళ్ల మాదిరే తుది 11లో చోటు ఇస్తే స్థిరంగా రాణిస్తానని తాను భరోసా ఇచ్చినట్గు గుర్తు చేశాడు. తన పాత్ర గురించి తానేమీ అతిగా ఆలోచించడం లేదన్నాడు. ‘‘చాలా మంది నన్ను అతి ఆలోచనవాదిగా మార్కెట్ చేశారు. ఇది సరికాదు. ఎవరి ప్రయాణం వారిదే. మరొకరి గురించి అలా చెప్పే హక్కు ఇంకొకరికి లేదు. దీనిపై విచారించే సమయం నాకు లేదు’’ అని అశ్విన్ స్పష్టం చేశాడు.