Kodali Nani: చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలి: కొడాలి నాని సవాల్

kodali nani challenge to chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ ఏం సాధించారని ప్రశ్నించారు. శుక్రవారం టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో నాని మాట్లాడారు. తన 20 ఏళ్ల కల నెరవేర్చడానికి గుడివాడ వచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు.

గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొడాలి నాని చెప్పారు. ‘‘ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి. దివంగత మహానేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్‌లు గుడివాడకి చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేను. చివరి వరకు సీఎం జగన్ వెంటే ఉంటా. నా ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా’’ అని స్పష్టం చేశారు. 

‘‘అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టాడు. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లు. వాళ్లిద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీలు అయ్యారు. మరి 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ ఏం సాధించాడు?’’ అని నిలదీశారు. చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటం, పవన్ కోరిక ఎమ్మెల్యే కావడం అని, ఇందుకోసమే ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. 

రెండు పార్టీలను కలుపుకుంటే గానీ పవన్‌ శాసనసభకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. జగన్ ను సీఎం సీటు నుంచి కదిపే దమ్ము చంద్రబాబు, పవన్‌లకు లేదని సవాల్ చేశారు. గుడివాడ వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతాడని, ఎన్టీఆర్‌ సొంత గ్రామానికి ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు.
Go Back to Shorts
Kodali Nani
Chandrababu
Pawan Kalyan
Jagan
YSRCP
TDP
Gudivada

More Telugu News