వీళ్లు వృద్ధులు అంటే నమ్మలేరు!
- సోషల్ మీడియాను ఊపేస్తున్న చైనా జిమ్నాస్ట్ ల వీడియో
- ఓల్డ్ ఏజ్ లోనూ అవలీలగా జిమ్నాస్టిక్స్ ప్రదర్శించిన చైనీయులు
- ఆనంద్ మహీంద్రా సైతం అచ్చెరువొందిన వైనం
ఈ వయసులోనూ చైనా జిమ్నాస్ట్ లు తమ శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటున్న తీరు, ఇంకా నిలిచి ఉన్న వారి జిమ్నాస్టిక్ నైపుణ్యానికి మచ్చుతునకగా ఆ వీడియో నిలుస్తుంది. ఐరన్ బార్ పై వాళ్లు చేస్తున్న విన్యాసాలు చూస్తే 70, 80 ఏళ్ల వృద్ధులంటే ఎవరూ నమ్మరు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఈ వీడియో చూసి అచ్చెరువొందారు. ఆదివారం వస్తే శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, కానీ వీడియో చూశాక జిమ్ కు వెళుతున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.