బాలకృష్ణ 108వ సినిమాకి ఖాయం చేసిన పవర్ఫుల్ టైటిల్ ఇదే!

Balakrishna 108 Movie Title Confirmed
  • 108వ సినిమా షూటింగులో బాలయ్య 
  • 'భగవంత్ కేసరి' టైటిల్ ను ఖరారు చేసిన టీమ్ 
  • ఆకట్టుకుంటున్న బాలయ్య పోస్టర్ 
  • దసరాకి సినిమా విడుదల    
బాలకృష్ణ అంటే మాస్ .. మాస్ ఆడియన్స్ నుంచి అత్యధిక ఆదరణ కలిగిన స్టార్. ఆయన సినిమా టైటిల్ దగ్గర నుంచి పవర్ఫుల్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అలాగే ఆయన సినిమాల్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలని ఆశపడతారు. ఇక ఫైట్స్ .. డాన్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పవలసిన పనేలేదు. 

ఒక్క మాటలో చెప్పుకోవాలంటే బాలకృష్ణ సినిమా అంటే దానికి కొన్ని కొలమానాలు తప్పకుండా ఉంటాయి. వాటికి తగినట్టుగానే ఆయన సినిమాలు ఉండేలా మేకర్స్ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాంటి అంశాలతోనే బాలయ్య 108వ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. 

ఈ సినిమాకి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ను సెట్ చేయనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అదే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, బాలయ్య పోస్టర్ ను వదిలారు. నేలలో దిగబడిన ఒక బలమైన ఆయుధాన్ని పైకి లాగుతూ బాలయ్య కనిపిస్తున్నాడు.

ఒక బలమైన యాక్షన్ సీన్ కి బాలయ్య రెడీ అవుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఆయన లుక్ ఇంతకుముందు సినిమాలకంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా, ఆయన కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు..
Go Back to Shorts
Balakrishna
Kajal Agarwal
Sreeleela
Bhagavanth Kesari Movie

More Telugu News