ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు... డిప్యూటీ గవర్నర్ మృతి

Deputy governor of northern Afghan province killed in car bomb attack
  • ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ లో శనివారం ఉదయం బాంబు పేలుడు
  • ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ నిస్సార్ తో పాటు ఆయన డ్రైవర్ మృతి చెందినట్లు వెల్లడి
  • కారులో పేలుడు పదార్థాలతో వచ్చి నిస్సార్ కారు సమీపంలో ఆత్మాహుతి దాడి
ఆఫ్ఘనిస్థాన్‌లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ మృతి చెందారు. ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నిస్సార్ అహ్మద్ అహ్మది మంగళవారం కారు బాంబు దాడిలో మరణించినట్లు ప్రావిన్షియల్ అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ ఘటనలో నిస్సార్ డ్రైవర్ కూడా మృతి చెందాడని, ఆరుగురు పౌరులు గాయపడ్డారని ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అధిపతి మహజుదీన్ అహ్మదీ చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదన్నారు. చాలా వారాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన మొదటి అతిపెద్ద పేలుడు ఇది.

ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలోకి దూసుకు వచ్చి పేల్చేసుకున్నాడు. ఈ ప్రావిన్స్ లో సాంస్కృతిక, సమాచార విభాగానికి అహ్మది అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా, ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం కాబుల్ సహా వివిధ పట్టణాలలో దాడులు చేస్తోంది.
Go Back to Shorts
Afghanistan
bomb blast

More Telugu News