టర్కీలో విజయ్ దేవరకొండ, సమంత
- ఖుషి షూటింగ్ కోసం వెళ్లిన హీరో, హీరోయిన్
- ఇద్దరిపై పాట చిత్రీకరిస్తున్న దర్శకుడు శివ
- ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న చిత్రం
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సమంత, విజయ్ టర్కీ వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్లలో ఈ ఇద్దరిపైనా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు షూటింగ్ విరామంలో అక్కడి రెస్టారెంట్ లో నచ్చిన ఆహారం తింటన్న ఫొటోను విజయ్, రిలాక్స్ అవుతున్న ఫొటోను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా, సమంత కశ్మీర్ యువతిగా కనిపించనున్నారు.