Advertisement

ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR Along With His Family Off to Vacation
  • ఎయిర్ పోర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం.. ట్విట్టర్ లో ఫొటోలు వైరల్
  • కొంతకాలంగా దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్
  • ఫ్యామిలీతో వెకేషన్ కోసం చిన్న విరామం తీసుకున్నట్లు ప్రచారం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో కలిసి ఎన్టీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆదివారం కనిపించారు. దీంతో ఎన్టీఆర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.

కొంతకాలంగా దేవర సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పనిచేయడానికి ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులను ప్రత్యేకంగా పిలిపించారు. కాగా, ఈ సినిమా షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకుని ఎన్టీఆర్ ఫ్యామిలీతో విహారయాత్రకు వెళుతున్నారని, తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొంటారని సినీవర్గాల సమాచారం.
Advertisement
Jr NTR
Entertainment
Family vacation
Devara

More Telugu News