ఐపీఎల్ ఫైనల్ వాయిదాతో.. నెట్ లో మీమ్స్ వెల్లువ
- ఎవరికి తోచిన విధంగా వారు వ్యంగ్య ట్వీట్లు
- పీకల దాకా మైదానంలో నీరు.. అందులోనే ఆడుతున్న క్రికెటర్లు
- నిరాశతో టీవీని బద్దలు కొడుతున్న దృశ్యం
‘‘ఎవరు అయితే రూ.12,000 పెట్టి టికెట్ కొన్నారో.. దాని విలువ రూ.6 వేలే. రేపు వర్కింగ్ రోజు’’ అని సాగర్ అనే ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు. గొంతు దాకా స్టేడియంలో నీరు నిలిచిపోవడంతో అందులోనే క్రికెట్ ఆడుతున్నట్టు రూపమ్ సాధుకా అనే వ్యక్తి ఓ ఇమేజ్ ను ట్వీట్ చేశాడు. ఇది చూడగానే నవ్వు తెప్పించే విధంగా ఉంది. ‘‘మీ ఫిజికల్ టికెట్లను దయచేసి భద్రంగా ఉంచుకోండి’’ అన్న సందేశం స్టేడియంలో ప్రదర్శిస్తున్న ఫొటోని దర్శన్ అనే వ్యక్తి పంచుకున్నాడు. ఇక మరీ నవ్వు తెప్పించే విధంగా.. ‘‘గేమ్ వచ్చే 30 నిమిషాల్లో ప్రారంభం కాకపోతే నా పరిస్థితి ఇదీ’’ అంటూ రీడర్ అనే ట్విట్టర్ యూజర్ ఓ వీడియో క్లిప్ షేర్ చేశాడు. అందులో టీవీని బద్దలు చేస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు.