'పుష్ప 2' కోసం తెరపైకి రణ్ వీర్ సింగ్!

Pushpa 2 movie update
  • షూటింగు దశలో 'పుష్ప2' 
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
  • భారీగా పెరుగుతున్న స్టార్స్ సంఖ్య 
  • కీలకమైన పాత్రకోసం రణ్ వీర్ సింగ్
బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' రూపొందుతోంది. ఫస్టు పార్ధుకి వచ్చిన రెస్పాన్స్  .. వసూళ్లను బట్టి, సెకండు పార్టు రేంజ్ ను ఒక లెవెల్లో పెంచుతున్నారు. బన్నీ లుక్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉండనుంది. తమిళ ... కన్నడ .. హిందీ భాషల నుంచి మరికొంతమంది స్టార్స్ ఉండేలా చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ పేర్లు వినిపించాయి. తాజాగా రణ్ వీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉండటంతో, వెంటనే ఆయన అంగీకరించాడని చెబుతున్నారు. 

తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో, ఇక్కడి సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ సైతం ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఒక వైపున ఎన్టీఆర్ సినిమా కోసం సైఫ్ .. మరో వైపున మహేశ్ మూవీ కోసం అక్షయ్ పేర్లు వినిపిస్తుండగా, 'పుష్ప 2' కోసం రణ్ వీర్ పేరు వినిపిస్తుండటం విశేషం. 

Advertisement
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2

More Telugu News