ఇలాంటి పకోడీ గాళ్లను మోదీ, అమిత్ షా కంట్రోల్ చేయాలి: కొడాలి నాని

Kodali Nani fires on Sunil Deodhar
  • తాము గెలిచాక కొడాలి నానిని జైలుకు పంపిస్తామన్న సునీల్ దేవధర్
  • సునీల్ దేవధర్ ఒక పకోడీ గాడన్న కొడాలి నాని
  • ఇట్లాంటి పకోడీ గాళ్ల వల్లే కర్ణాటకలో బీజేపీ సంకనాకిపోయిందని వ్యాఖ్యలు
  • జేబులో పైసా లేకపోయినా ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెబుతుంటారని విమర్శలు
వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని, ఏపీలో తాము గెలిచాక కొడాలి నాని వంటి వారిని జైలుకు పంపిస్తామని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. సునీల్ దేవధర్ వంటి పకోడీ గాళ్ల వల్ల కర్ణాటకలో బీజేపీ సంక నాకిపోయిందని వ్యాఖ్యానించారు. అయినాగానీ వాళ్లకు బుద్ధిరాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 

"మోదీ, అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మధ్యలో ఈ సునీల్ పకోడీ లాంటి వాళ్లు వస్తుంటారు. జేబులో ఐదు పైసల బిళ్ల కూడా ఉండదు... ఇక్కడికి వస్తే స్థానిక నాయకులు ఫ్లైట్ టికెట్లు కొనిస్తారు. రూములు బుక్ చేస్తుంటారు, కార్లు ఏర్పాటు చేస్తుంటారు. దాంతో ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెబుతుంటారు. మసీదులను కూలగొడతాం, చర్చిల్లో క్రిస్టియన్లను ప్రార్ధన చేసుకోనివ్వం వంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఈ మాటలు మాట్లాడే కదా కర్ణాటకలో బీజేపీని దయనీయ స్థితికి తీసుకువచ్చారు!

రాజకీయ నాయకుడు అంటే, అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తామో చెప్పాలి. ఈ సునీల్ పకోడీ లాంటి వాళ్లు వచ్చి తెలంగాణలో కూడా సంకనాకిస్తారు. ఇలాంటి దరిద్రుల్ని పెట్టుకుంటే బీజేపీకి దుస్థితి తప్పదు. ఇలాంటి వాళ్లందరూ రాష్ట్రాలకు వచ్చి ఏం మాట్లాడుతుంటారో మోదీ, అమిత్ షా గమనిస్తూ వాళ్లను కంట్రోల్ చేస్తుండాలి" అని కొడాలి నాని పేర్కొన్నారు.
Advertisement
Kodali Nani
Sunil Deodhar
YSRCP
BJP
Andhra Pradesh

More Telugu News