పశ్చిమ బెంగాల్లో 'ది కేరళ స్టోరీ' నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Add ap7am to your home Screen

పశ్చిమ బెంగాల్లో 'ది కేరళ స్టోరీ' నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Supreme Court Pauses Bengal Ban On The Kerala Story
  • తమిళనాడులోను థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని ఆదేశాలు
  • సినిమాలో వివాదాస్పద అంశం మార్పుపై నిర్మాతకు సూచన
  • చిత్రాన్ని చూడాలనుకుంటున్నట్లు చెప్పిన సుప్రీం ధర్మాసనం
'ది కేరళ స్టోరీ' చిత్రంపై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడులోని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కూడా రక్షణ కల్పించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సినిమాలో వివాదాస్పదంగా మారిన ఓ అంశం గురించి మార్పు చేయాలని నిర్మాతకు కూడా సూచించింది. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఈ చిత్రాన్ని ఓసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.
Advertisement
West Bengal
the kerala story

More Telugu News