లోకేశ్ యువగళంకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన నక్కా ఆనందబాబు
- 100వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ కు సంఘీభావంగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్న టీడీపీ నేతలు
- వేమూరు నియోజకవర్గంలో నక్కా ఆనందబాబు పాదయాత్ర
లోకేశ్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలను సృష్టించిందని ఆనందబాబు మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమవుతూ లోకేశ్ యాత్ర కొనసాగుతోందని చెప్పారు. జగన్ పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తించి అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని... లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.