'PS-2'లో టీనేజ్ నందిని పాత్రలో మెరిసిన 'సారా అర్జున్'

Sara Arjun Special
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా చూసినవారు ఫస్టు షాట్ ను ఇప్పట్లో మరిచిపోరు. స్నానం కోసం నదిలోకి దిగిన ఒక టీనేజ్ అమ్మాయి, తల వరకూ నదిలో మునిగి పైకి లేస్తుంది. ఆ షాట్ లో ఆ యువతి స్వచ్ఛమైన ముత్యంలా మెరుస్తుంది. ఆ షాట్ లో అంత అందంగా కనిపించిన ఆ యువతి పాత్ర పేరు నందిని.ఈ సినిమాలో నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ కనిపిస్తుంది. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆమె టీనేజ్ పాత్రతో మొదలవుతుంది. ఆ పాత్రను పోషించిన యువతి పేరు 'సారా అర్జున్'. 2011లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ మొదలైంది. హిందీ .. తమిళ .. మలయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అనేక పాత్రలలో మెప్పించింది. 2015లో 'దాగుడుమూత దండాకోర్' అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించింది.  'సారా అర్జున్' తండ్రి కూడా నటుడే .. అతనే 'రాజ్ అర్జున్'. పలు సినిమాలలోను .. వెబ్ సిరీస్ లలోను .. టీవీ సీరియల్స్ లోను ఆయన నటించాడు. తండ్రి బాటలోనే  సారా అర్జున్ నటన దిశగా అడుగులు వేసిందన్న మాట. 'PS -1' లో ఆమె మెరిసినప్పటికీ, ఆ పాత్రను పూర్తిస్థాయిలో ఆవిష్కరించింది మాత్రం 'PS -2'లోనే. టీనేజ్ లోని ఆదిత్య కరికలాన్ ను ప్రేమించే పాత్రలో ఆమె గొప్పగా నటించింది. ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Go Back to Shorts
Vikram
Karthi
Aishwarya Rai
Trisha
Sara Arjun

More Telugu News