ప్రియుడితో కలిసి మరోసారి కెమెరాకు చిక్కిన తమన్నా

Tamannaah caught once again with her lover
  • బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న తమన్నా  
  • గతంలో వైరల్ అయిన వీరి ముద్దు వీడియో
  • తాజాగా ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోయిన వైనం
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేస్తున్నట్టు చెపుతున్నారు. కొత్త సంవత్సర వేడుక సందర్భంగా వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా వీరిద్దరూ మరోసారి మీడియా కంటికి చిక్కారు. ముంబైలో వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిల్ ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమన్నా చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. చిరంజీవి సినిమా 'భోళాశంకర్' కూడా అందులో ఒకటి. ఇంకోవైపు తమన్నా, విజయ్ వర్మలు 'లస్ట్ స్టోరీస్ - 2'లో నటించారు. అప్పటి నుంచే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనేది బీటౌన్ టాక్.
Advertisement
Tamannaah
Vijay Varma
Tollywood
Bollywood

More Telugu News