మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత ఎర్నేని నవీన్ కు అస్వస్థత

  • బీపీ పెరగడంతో అస్వస్థత
  • సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
  • గత మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఇంట్లో ఐటీ సోదాలు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ ఎక్కువ కావడంతో ఆయన అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది. ఆయనను సమీపంలోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన బీపీ సాధారణ స్థితికి వచ్చినట్టు చెపుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్, నవీన్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.

Mytri Movie Makes
Naveen
Tollywood

More Telugu News