Vijayasai Reddy: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy greetings to Chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 'టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని విజయసాయి ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు విజయసాయి దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని దాదాపుగా ఆపేశారు. ఈ తరుణంలో చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Greetings

More Telugu News