ఒక్క రోజే 7,840 కరోనా కేసుల నమోదు
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
- 40 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
- ఢిల్లీలో వెయ్యికి చేరువైన డైలీ కేసులు
రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరిందని అధికారులు పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు. వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది.