దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఒక డిమాండ్ నెరవేరింది: విజయసాయిరెడ్డి

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ఇవాళ నెరవేరిందని, ఈ రైలు అంశాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో చాలా రోజులుగా ప్రస్తావిస్తూనే ఉన్నారని విజయసాయిరెడ్డి వివరించారు. 

తిరుపతి యాత్రికులకు ఈ వందేభారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయం 12 గంటలు కాగా, ఈ రైలుతో అది ఎనిమిదిన్నర గంటలకు తగ్గిపోతుందని, ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడే అంశమని పేర్కొన్నారు.


More Telugu News