Pushpa-2: పుష్ప-2 నుంచి గ్లింప్స్ రిలీజ్... వీడియో మామూలుగా లేదు!

Glimpse from Pushpa 2 The Rule out now
  • బన్నీ, సుకుమార్ కాంబోలో పుష్ప బ్లాక్ బస్టర్ హిట్
  • అదే కలయికలో పుష్ప-2
  • రోమాంఛక సన్నివేశాలతో సీక్వెల్
  • గ్లింప్స్ వీడియోతో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసిన సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో పుష్ప కలెక్షన్ల జడివాన కురిపించింది. అల్లు అర్జున్ నటనకు, మేనరిజమ్స్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. తగ్గేదే లే అనే మేనరిజమ్ వరల్డ్ వైడ్ పాప్యులారిటీ పొందింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, పాటలు ఈ సినిమాను మరో రేంజికి తీసుకెళ్లాయి. ఊ అంటావా పాట సూపర్ డూపర్ హిట్టయింది.

ఇప్పుడు ఇదే కాంబోలో 'పుష్ప-2 ద రూల్' వస్తోంది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా పుష్ప-2 చిత్రబృందం గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. తొలి పార్ట్ ను మించిన డ్రామా ఈ సీక్వెల్ లో ఉన్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. 

తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఆచూకీ లేకపోవడంతో, పుష్ప ఎక్కడ అంటూ చర్చించుకోవడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. పుష్ప అసలున్నాడా? పోలీసులు అతడి శవాన్ని మాయం చేశారా? అనే సందేహాలు వెలువడతాయి. పుష్ప-2 ఎంత రసవత్తరంగా ఉండబోతోందో సుకుమార్ ఈ గ్లింప్స్ తో దాదాపుగా హింట్ ఇచ్చేశాడు. 

ఈ వీడియోలోని ప్రతి సన్నివేశం పుష్ప హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉండడం గమనించవచ్చు. చివర్లో పెద్దపులి పక్కనుంచి బన్నీ నడిచే సీన్ హైలైట్ గా నిలిచింది. ఇంకెందుకాలస్యం ఈ గ్లింప్స్ వీడియో మీరు కూడా చూసేయండి.

More Telugu News

Pushpa-2
Glimpse
Allu Arjun
Sukumar
Tollywood