సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే.. : నాగబాబు అసహనం
- చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మాట్లాడిన నాగబాబు
- ‘పవర్ స్టార్ సీఎం’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు
- జనసేన సైనికులు సంస్కారాన్ని వదులుకోవద్దంటూ మెగా బ్రదర్ ఆగ్రహం
కానీ బాల్కనీలో ఒకవైపున ఉన్న కొందరు పదేపదే ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను తాను నియంత్రించుకుంటూ.. ‘‘మనం ఇవాళ వచ్చింది చరణ్ బర్త్ డే వేడుకలకు కాబట్టి.. మొదట గౌరవం చరణ్ కు ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పారు.
కానీ అరుపులు, నినాదాలు మాత్రం ఇగలేదు. కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న నాగబాబు తర్వాత మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా.. ‘సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎంను చేయాలి’ అని అన్నారు కదా. కాబట్టి సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది పవన్ కల్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికే వచ్చానని నవ్వుతూ.. తన ప్రసంగాన్ని కొనసాగించారు.