ఎన్టీఆర్ అంటే ప్రాణం .. ఆయనను పెద్దన్నయ్య అంటా: కమెడియన్ రోలర్ రఘు

Raghu Interview
  • కమెడియన్ గా మెప్పించిన రఘు
  • ఎన్టీఆర్ తో స్నేహం గురించిన ప్రస్తావన
  • పెళ్లికి ముందు రోజులను గురించిన సంగతులు
  • అప్పట్లో సరదాగా తిరిగేవాళ్లమని వెల్లడి
కమెడియన్ గా రోలర్ రఘుకి మంచి గుర్తింపు ఉంది. తనదైన యాసలో ఆయన డైలాగ్ డెలివరీ చాలామందికి నచ్చుతుంది. తెరపై అమాయకంగా ఫేస్ పెట్టి ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చే పాత్రలను ఆయన బాగా చేస్తారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు.

"అప్పట్లో ఎన్టీ రామారావుగారు .. ఆ తరువాత బాలకృష్ణగారు .. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం. ఆయన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. ముందు నుంచి ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన పెళ్లికి ముందు మేమంతా కలిసి సరదాగా తిరిగేవాళ్లం. అప్పుడు మాకు సమయం తెలిసేది కాదు" అన్నారు. 

ఎన్టీఆర్ తన స్నేహితులను కూడా కుటుంబసభ్యుల మాదిరిగానే చూసుకుంటారు. నేను ఆయనను పెద్దన్నయ్య అని పిలుస్తాను. తన సినిమాల్లో మేము చేసే పాత్రలేమైనా ఉంటే మాకు వస్తాయి. అంతేగానీ ఫలానా పాత్రలో మా ఫ్రెండును పెట్టుకోమని ఆయన సిఫార్స్ చేయరు. పాత్రకి తగిన నటులు ఉండాలనేదే ఆయన అభిప్రాయం. ఏ ఫ్రెండ్ తోనూ ఆయనకి ఎలాంటి మనస్పర్థలు రాలేదు" అని చెప్పుకొచ్చారు. 

Advertisement
Junior NTR
Raghu
Tollywood

More Telugu News