ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో.. గైడ్ లైన్స్ జారీ చేసిన ఐసీఎంఆర్

11-03-2023 Sat 12:46 | Health
Advertisement
  • హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని సూచన
  • జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు హితవు
  • నెలాఖరులోగా కేసులు తగ్గుతాయని వెల్లడి
Advertisement
దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతుండడం, హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ జారీ చేసింది. హెచ్3ఎన్2 వైరస్ సీజనల్ వ్యాధి అని పేర్కొంటూ ఏటా రెండు పర్యాయాల్లో పలు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయని తెలిపింది. 

ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఈ నెలాఖరులోగా తగ్గుముఖం పడతాయని వివరించింది. అయితే, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంది. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది.

ఈ జాగ్రత్తలతో వైరస్ నుంచి భద్రత
  • ఇంట్లో నుంచి బయటకు వచ్చినపుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండడం మేలు
  • దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుతో పాటు నోటిని కూడా కవర్ చేసుకోవాలి
  • చేతులతో కళ్ళు, ముక్కును పదేపదే తాకవద్దు. వైరస్ వ్యాప్తికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది
  • జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి
  • కరచాలనం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం చేయొద్దు
  • వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్ మందులు వాడొద్దు
  • గ్రూప్ గా కూర్చుని ఆహారం తీసుకోవడం మానేయాలి
Advertisement
H3N2virusICMRguidelines

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more