నా చెల్లెలు అమెరికా వెళ్తానంటే.. నాకంటే ముందే పంపించారు: కేటీఆర్
- అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలన్న కేటీఆర్
- తన తల్లిదండ్రులు తన చెల్లెల్ని కూడా బాగా చదివించారని వ్యాఖ్య
- తాము కూడా తమ పిల్లల్ని సమానంగా చూస్తున్నామన్న కేటీఆర్
కవిత అమెరికాకు వెళ్తానంటే తన కంటే ముందే ఆమెను అక్కడకు పంపించారని చెప్పారు. అలా తన కంటే ముందే కవిత అమెరికాకు వెళ్లిందని తెలిపారు. తాము కూడా తమ పిల్లలను సమానంగా చూస్తున్నామని అన్నారు. పిల్లలకు నమ్మకం కలిగిస్తే... వంద శాతం అభివృద్ధిని సాధిస్తారని చెప్పారు. ఇంజినీర్, డాక్టర్, లాయర్ కావాలని ఇంట్లో చెపుతుంటారని... వాళ్లు వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. హైదరాబాద్ వీ హబ్ 5వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు.