మధు మంతెనను పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun pays condolences to Madhu Manthena
  • నిర్మాత మధు మంతెన తండ్రి మురళీరాజు మృతి
  • మధు మంతెన నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్
  • బాలీవుడ్ లో పలు చిత్రాలను నిర్మించిన మధు  
సినీ నిర్మాత మధు మంతెన నివాసానికి వెళ్లిన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ఆయనను పరామర్శించారు. అనారోగ్యం కారణంగా మధు మంతెన తండ్రి మురళీరాజు ఈరోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మధు మంతెనకు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. మధు మంతెన హిందీలో ఎక్కువ సినిమాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీలో కూడా నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్ లో గజినీ, సూపర్ 30, ఉడ్తా పంజాబ్, '83 తదితర ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు.
Advertisement
Madhu Manthena
Allu Arjun
Tollywood
Bollywood

More Telugu News