మహీంద్రా ఆటో నడిపిన బిల్ గేట్స్... మిత్రుడు ఆనంద్ మహీంద్రా స్పందన
- ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్
- మహీంద్రా ట్రియో ఆటోను నడిపిన గేట్స్
- 'చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడీ' అన్న ఆనంద్ మహీంద్రా
అంతకు ముందు మహీంద్రా ట్రియో ఆటోను నడుపుతున్న వీడియోను బిల్ గేట్స్ షేర్ చేశాడు. కొత్తదనాన్ని కనుక్కోవాలనే తపనలో భారత్ అభిరుచి ఎప్పటికీ ఆశ్చర్యానికి గురి చేయదని బిల్ గేట్స్ అన్నారు. తాను ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపానని ఇది 131 కిలోమీటర్లు (సుమారు 81 మైళ్లు) ప్రయాణించగలదని చెప్పారు. నలుగురు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చని తెలిపారు. ట్రాన్స్ పోర్టేషన్ రంగంలో డీకార్బొనైజేషన్ దిశగా ఎంతో కృషి చేస్తున్న మహీంద్రా వంటి కంపెనీలను చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. మరోవైపు బిల్ గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరూ స్నేహితులనే విషయం తెలిసిందే. హార్వర్డ్ యూనివర్శిటీలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు.