తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...?
- ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ
- తెరమరుగైన టీఆర్ఎస్ పేరు
- అయితే టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ అంటూ ప్రచారం
ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని కొందరు కీలకనేతలు సారథ్యం వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.