Varma: మీ డ్రెస్ నాకు నచ్చలేదు: యాంకర్ తో వర్మ

Ram Gopal Varma Interview
షార్ట్స్‌లో చూడండి
రామ్ గోపాల్ వర్మ ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. ఏ అంశాన్ని గురించి ప్రస్తావించినా తడుముకోకుండా సమాధానాలిస్తూ ఉంటారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. "నన్ను లవ్ చేసేవాళ్లన్నా .. నన్ను హేట్ చేసే వాళ్లన్నా నాకు పడదు. నా చావు నేను చస్తా .. మీ బతుకు మీరు బతకండి అనే నేను చెబుతూ ఉంటాను" అన్నారు. 

"నేను ఎవరి గురించీ ఆలోచించను .. నా గురించి ఆలోచన చేస్తున్నారంటే వాళ్లకి వేరే పని లేదని అర్థం. నా ఆనందానికి యాడ్ అయ్యేవారు నాతో ఉంటారు. అలా కాని రోజున వెంటనే వారిని కట్ చేసేస్తాను. ఒకరిలా మరొకరు ఉండటం సాధ్యం కాదు .. ఈ చిన్న లాజిక్ ను మరిచిపోతున్నారు. నా గురించి తెలిసినవారే ట్విట్టర్ లో నన్ను ఫాలో అవుతున్నారు. ఇష్టం లేకపోతే బయటికి వెళ్లిపోయే సదుపాయం కూడా ఉంది కదా" అని చెప్పారు. 

"నాకు అమ్మాయిలన్నా .. వాళ్ల కాళ్లు నాకడమన్నా ఇష్టం. ఎవరో ఏదో అనుకుంటారనేది నేను పట్టించుకోను.  మీరు వేసుకున్న పింక్ డ్రెస్ నాకు నచ్చలేదు. కానీ ఆ విషయం చెప్పడానికి నేను ఎవరు? అది మీ ఇష్టానికి సంబంధించింది. ఎందుకు మీరు పింక్ వేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు .. అదో  చెత్త కలర్ అని చెబితే మీకు ఎలా ఉంటుందో .. నాకూ అలాగే ఉంటుంది" అన్నారు తనను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ తో. 

Go Back to Shorts
Varma
Director
Tollywood

More Telugu News