పవన్ కల్యాణ్ ను, జనసేనను మేము గుర్తించడం లేదు: ఏపీ మంత్రి కాకాణి
- తోలుబొమ్మలాటలో పవన్ ఒక జోకర్ అన్న కాకాణి
- కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే వారి పని అని విమర్శ
- చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్య
175 స్థానాల్లో పోటీ చేస్తారా? అని ముఖ్యమంత్రి జగన్ విసిరిన సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబు నీతి, నిజాయతీ లేని వ్యక్తి అని, దుర్మార్గుడని అన్నారు. బాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు జనాలు రావడం లేదని... పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు.