ఆ మాట నేను చెబితే అబద్ధమే అవుతుంది: సీనియర్ హీరోయిన్ లయ
Add ap7am to your home Screen

ఆ మాట నేను చెబితే అబద్ధమే అవుతుంది: సీనియర్ హీరోయిన్ లయ

Laya Interview
  • ఫ్యామిలీ హీరోయిన్ గా లయకి మంచి క్రేజ్
  • వివాహం తరువాత నటనకి దూరమైన లయ 
  • భర్త సపోర్ట్ ఉందంటూ హర్షం
  • ఇన్ స్టాలో ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉన్నానని వెల్లడి  

తెలుగులో సౌందర్య తరువాత తెరపై అంత పద్ధతిగా కనిపించిన కథానాయిక 'లయ'. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆ పాత్రలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అభిమానులను సంపాదించిపెట్టాయి. కెరియర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ .. " సినిమాల్లో హీరోయిన్ గా చేస్తాననీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మంచి క్రేజ్ వచ్చిన తరువాత నేను సినిమాలు మానేయవలసి వచ్చింది. అలాంటి ఒక సమయంలో సినిమాలకి దూరం కావడం నాకు చాలా బాధను కలిగించింది. అలాంటి బాధేం లేదని చెబితే అది అబద్ధమే అవుతుంది" అని అన్నారు.

"సినిమాలు చేయవద్దని మా వారు ఎప్పుడూ అనలేదు. ప్రస్తుతం నేను చేస్తున్న రీల్స్ అన్నీ కూడా షూట్ చేసేది ఆయనే. అంతకుముందు సోషల్ మీడియాలో ఉంటే నా ప్రైవసీ దెబ్బతింటుందని అనుకున్నాను. కానీ నా అభిమానులకు దూరమయిపోతానని ఆలోచన చేయలేదు. అందువల్లనే ఇన్ స్టాలో ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాను" అని చెప్పుకొచ్చారు.  

Advertisement
Laya
Actress
Tollywood

More Telugu News