హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ మధ్య క్లాష్.. విద్యార్థులకు తీవ్ర గాయాలు
- ఈ ఏడాది వర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు
- వర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ
- ఎస్ఎఫ్ఐ తమపై దాడిచేసినట్టు ఆరోపించిన ఏబీవీపీ
వర్సిటీ క్యాంపస్ డోర్లు, అద్దాలు ధ్వంసమైన దృశ్యాలను చూస్తే గొడవ పెద్దదిగానే కనిపిస్తోంది. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ ల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించి ఎస్ఎఫ్ఐ వర్గంపై ఏబీవీపీ ఆరోపణలు గుప్పించింది. తమ గ్రూపులోని గిరిజన విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ వర్గీయులు దాడి చేసి కొట్టినట్టు ఆరోపించింది. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్టు పేర్కొంది. ఈ ఏడాది విద్యార్థి సంఘాల ఎన్నికలను యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ తరుణంలో దాడి జరగడం గమనార్హం.