ఈ చిట్కాలతో హాయిగా నిద్రించవచ్చు !
- మారిన జీవనశైలి వల్ల నిద్రలేమి బాధితుల పెరుగుదల
- రాత్రిపూట ఏడెనిమిది గంటల నిద్ర అవసరం అంటున్న నిపుణులు
- రోజంతా అలసిన శరీరానికి విశ్రాంతి లభించేది నిద్రలోనేనని వెల్లడి
పడుకునే ముందు పాదాలను ఆవాల నూనెతో కాసేపు మర్దించడం వల్ల ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సుఖ నిద్ర పొందుతారని చెప్పారు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని పాలల్లో అశ్వగంధ పొడిని కలిపి తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల నిద్రాదేవి కోసం ఎదురుచూడాల్సిన అవసరం తప్పుతుందని, హాయిగా నిద్రిస్తారని పేర్కొన్నారు. పాలల్లో కాస్త తేనె కలుపుకుని తాగినా ఫలితం ఉంటుందని వివరించారు. మనస్సును రిలాక్స్ చేసేందుకు చామంతి టీ దివ్యౌషధంగా పనిచేస్తుందని, నిద్రలేమి సమస్యను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.