ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి
- హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం
- ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత
- ఆయనను పరామర్శించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
- కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాల సేకరణ
- ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సాయిరెడ్డి
ముద్రగడ పద్మనాభం ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో, విజయసాయిరెడ్డి నేరుగా ఆయన్ను కలవలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ముద్రగడ గిరి, ఇతర కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి, చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఉన్నత రాజకీయ విలువలు కలిగిన ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.