నిష్కల్మషమైన నీ ప్రేమ మన బంధుత్వం కంటే గొప్పది: తారకరత్న మృతితో తీవ్ర విషాదానికి లోనైన నారా లోకేశ్

Lokesh reacts to Tarakaratna demise
  • నందమూరి తారకరత్న కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
  • ఆ అడుగుల చప్పుడు ఆగిపోయిందంటూ సందేశం
  • తారకరత్నకు లోకేశ్ కన్నీటి నివాళులు
నందమూరి తారకరత్న మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. 

"నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నాను" అంటూ లోకేశ్ వేదనాభరిత హృదయంతో సందేశం వెలువరించారు.
Go Back to Shorts
Nara Lokesh
Tarakaratna
Demise
TDP

More Telugu News