కవర్ సాంగ్ చేసిన హిమాన్షు... మురిసిపోయిన కేటీఆర్
- వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న కేటీఆర్ తనయుడు
- జేవీకేఈ గోల్డెన్ అవర్ సాంగ్ కు కవర్ సాంగ్ చేసిన వైనం
- తన యూట్యూబ్ చానల్లో రిలీజ్ చేసిన హిమాన్షు
- ఎంతో గర్విస్తున్నానన్న కేటీఆర్
తనయుడి కవర్ సాంగ్ పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వెలిబుచ్చారు. నా బిడ్డ ఘనత పట్ల ఉద్విగ్నతకు లోనయ్యానని, ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. ఈ వీడియోను ఎంతగానో ఆస్వాదించానని కేటీఆర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.