అమెరికా పెద్దలసభలో తీర్మానం.. అది భారత భూభాగమేనని తేల్చిచెప్పిన సెనేటర్లు
- భారత్‌కు మద్దతుగా అమెరికా పెద్దలసభలో తీర్మానం
- అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమంటూ తీర్మానంలో స్పష్టీకరణ
- చైనా విస్తరణవాదాన్ని ఖండించిన ముగ్గురు సెనేటర్లు
చైనా రెచ్చగొట్టే వైఖరిని సెనేటర్లు ముక్తకంఠంతో ఖండించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సైనికశక్తిని వినియోగిస్తుండటంపై మండిపడ్డారు. స్వీయ రక్షణ లక్ష్యంతో భారత్.. చైనా దూకుడుకు అడ్డుకట్ట కోసం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా.. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ ప్రాంతంలో భారత్‌కు అమెరికా అండగా నిలవాలన్న ప్రతిపాదనను తమ తీర్మానంలో పొందుపరిచారు.
‘‘ ప్రస్తుతం చైనా తన లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచక్రమాన్ని మార్చాలనుకుంటోంది అయితే.. అమెరికా తీసుకునే చర్యలన్నింటికీ.. స్వేచ్ఛాస్వాంతంత్ర్యాలను పరిరక్షించాలన్న భావనే కేంద్రంగా ఉండాలి’’ అని వారు తమ తీర్మానంలో పేర్కొన్నారు.