కాంతార 2లో బాలీవుడ్ హీరోయిన్
- 16 కోట్లతో తెరకెక్కి రూ.400 కోట్లు రాబట్టిన కాంతార
- చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో హీరో, దర్శకుడు రిషబ్ షెట్టి
- కాంతార 2లో ఊర్మశి రౌతేలా
తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా నటించనుంది. బాలీవుడ్లో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ చిత్రం ’వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ పాటలో నర్తించిన తను టాలీవుడ్ కు దగ్గరైంది. ఈ క్రమంలో ఆమెకు కాంతార 2లో అవకాశం లభించినట్టు తెలుస్తోంది. ఊర్వశి సోషల్ మీడియాలో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టితో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. కాంతార 2 లోడింగ్ అని పేర్కొన్నది. అయితే, కాంతార 2లో ఆమెనే ప్రధాన హీరోయిన్ గా నటిస్తుందా? ప్రత్యేక పాత్రలో నర్తిస్తుందా? లేక వేరే ఏదైనా పాత్ర చేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.