కష్టంలో ఉన్న అభిమాని కోసం అల్లు అర్జున్ సాయం
- ‘అల్జు అర్జున్ ఫ్యాన్స్’ క్లబ్ సభ్యుడికి ఆర్థిక ఇబ్బందులు
- అనారోగ్యంతో ఉన్న తండ్రి చికిత్స కోసం అధిక వ్యయం
- సాయం కోసం ట్విట్టర్లో పిలుపు
ఈ విషయం తెలియడంతో అల్లు అర్జున్ తగినంత సాయాన్ని అందించాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ధ్రువీకరించింది. ‘‘ఇటీవలే మా సహ అభిమాని ఒకరి సమస్యను ప్రస్తావించగా, ఇది తెలుసుకుని అల్లు అర్జున్ కావాల్సిన అన్ని రకాల సాయాన్ని అందించాడు. తన బృందంతో కలసి కావల్సినంత సమకూర్చాడు’’ అని ట్వీట్ చేశాడు. దైవం మనుష్య రూపేణా అంటూ అల్లు అర్జున్ కు ట్యాగ్ చేశారు.