ప్యానెల్ వైస్ చైర్మన్ గా రాజ్యసభను నడిపించిన పీటీ ఉష
- చైర్మన్ గైర్హాజరీలో సభాపతిగా పీటీ ఉష
- రాజ్యసభలో ఆసక్తికర దృశ్యం
- గతేడాది పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేసిన కేంద్రం
దీనిపై పీటీ ఉష తన స్పందనను ట్విట్టర్ లో వెల్లడించారు. శక్తిమంతమైన పదవి గొప్ప బాధ్యతను కలిగి ఉంటుందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ వ్యాఖ్యలను ఆమె ఉదహరించారు. ఇవాళ వైస్ చైర్మన్ హోదాలో రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తాను కూడా అదే అనుభూతికి లోనయ్యానని వివరించారు. తన ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రయాణంలో ఘనతలు అందుకోగలనంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.