'పాప్ కార్న్' సెన్సార్ పూర్తి .. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పాప్ కార్న్' సెన్సార్ పూర్తి .. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్!

Pop Corn movie update
  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'పాప్ కార్న్' 
  • అవికా గోర్ - సాయి రోనక్ జంటగా నటించిన సినిమా 
  • యు/ఎ సర్టిఫికేట్ ను అందించిన సెన్సార్ బోర్డు 
  • ఈ నెల 10వ తేదీన సినిమా రిలీజ్  
అవికా గోర్‌ .. సాయి రోన‌క్ జంట‌గా నటించిన చిత్రమే ‘పాప్ కార్న్’. ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా - నెపోలియ‌న్‌ ఈ సినిమాను నిర్మించారు. అవికా గోర్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకి, ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వహించాడు. ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలకు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. చైతూ చేతులు మీదుగా రిలీజ్ చేయించిన 'మది విహంగమాయే' పాట యూత్ కి ఒక రేంజ్ కనెక్ట్ అయింది. 

అవికా గోర్ మాట్లాడుతూ .. ‘ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాలోని చివరి 45 నిమిషాలు ఆడియెన్స్‌ లో ఉత్కంఠను రేకెత్తిస్తాయనీ, సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
Advertisement
Avika
Sai Ronak
Pop Corn Movie

More Telugu News