హరీశ్ కొత్త సీసా తీసుకొని పోతే.. మామ పాత సారా పోశారు.. తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు

Sharmila satires on Telangana budget
  • కొత్తగా ఏమీ లేదని, గతేడాది బడ్జెట్‎ను కాపీ పేస్ట్ చేశారని షర్మిల విమర్శలు
  • గతేడాది కేటాయింపులు, ఖర్చులపై సమాధానం చెప్పాలని డిమాండ్
  • 8 ఏళ్లుగా సీఎం ఒక్క హామీ నిలబెట్టుకోలేదని ఆరోపణ
తెలంగాణ బడ్జెట్ పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. ‘‘మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్‎కి వెళ్లారు. అందులో ఆయన మామ పాత సారా పోశారు’’ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.

గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని, గతేడాది బడ్జెట్‎ను కాపీ పేస్ట్ చేశారని, ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. అసలు కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకని నిలదీశారు. 

8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం ఇచ్చిన మాటకు విలువ ఉండదా? అని ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Sharmila
Telangana budget
YSRTP
brs
Yuva Galam Padayatra
YS Sharmila

More Telugu News