ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? చెక్ చేసుకోవచ్చు ఇలా..!

06-02-2023 Mon 12:27 | Offbeat
Advertisement
  • మార్చి 31లోగా అనుసంధానించుకోవాలి  
  • లేదంటే పాన్ డీయాక్టివేట్ అయిపోతుంది
  • ఆన్ లైన్ లోనే సులభంగా స్టేటస్ తెలుసుకోవచ్చు
Advertisement
ఆధార్ తో పాన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. అయినా ఇప్పటికీ చాలా మంది ఇంకా అనుసంధానించుకోలేదు. ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 61 కోట్ల పాన్ లు విడుదల చేయగా.. కేవలం 48 కోట్ల మంది అనుసంధానించుకున్నారు. అంటే ఇంకా 13 కోట్ల మంది ఆధార్ తో లింక్ చేసుకోలేదని తెలుస్తోంది.

ఆధార్-పాన్ అనుసంధానం పూర్తిగా ఉచితమే అయినా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు రూ.1,000 చెల్లించి మార్చి 31 వరకు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్-పాన్ అనుసంధానించుకోకపోతే మార్చి 31 తర్వాతి రోజు నుంచి పాన్ డీయాక్టివేట్ అయిపోతుంది. దీంతో పెట్టుబడులు, ముఖ్య ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలు పడదు. పన్ను రిటర్నులు కూడా దాఖలు చేయలేరు. మిగిలిన వారు కూడా మార్చి 31లోపు లింక్ చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి కోరుతోంది.

ఆదాయపన్ను శాఖ పోర్టల్ కు వెళ్లి ఆధార్-పాన్ నంబర్ అనుసంధానించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే లింక్ చేసుకున్నదీ, లేనిది తనిఖీ చేసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లో ఎడమ చేతి వైపు లింక్ ఆధార్ స్టేటస్, లింక్ ఆధార్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని సెలక్ట్ చేసుకుని ముందుకు వెళ్లాలి. అలాగే, https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar పోర్టల్ కు వెళ్లి పాన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాపెచా ఇస్తే అనుసంధానం గురించి సమాచారం తెలియజేస్తుంది. 

Advertisement
Aadhaarpaanlinkstatus

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more