Sundeep Kishan: నేను స్ఫూర్తిగా తీసుకునేది నానీనే: 'మైఖేల్' ఈవెంటులో సందీప్ కిషన్

Michael Movie Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
సందీప్ కిషన్ హీరోగా 'మైఖేల్' సినిమా రూపొందింది. భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకి, రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. గౌతమ్ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. నాని ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేదికపై సందీప్ కిషన్ మాట్లాడుతూ .. " నేను .. నాని చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. కానీ ఆయన నా సినిమా ఈవెంటుకి రావడం ఇదే ఫస్టు టైమ్. తనని చూసి ఎప్పటికప్పుడు నేను స్ఫూర్తిని పొందుతూనే ఉంటాను" అన్నాడు. 

"దర్శకుడు రంజిత్ జయకోడి నన్ను నాకు కొత్తగా పరిచయం చేశాడు. సందీప్ ఫలానా ఫలానా ఐటమ్స్ ను సరిగ్గా చేయలేడు అని కొంతమంది అన్నారు. అవన్నీ కూడా నేను ఈ సినిమాలో చేశాను. సామ్ సీఎస్ సంగీతం .. కిరణ్ కౌశిక్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Sundeep Kishan
Divyansha Koushik
Michael Movie

More Telugu News