ఆసుపత్రిలో వెంటిలేటర్ పై తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
- బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
- విషమంగానే ఉన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి
- కుటుంబ సభ్యులను కూడా ఐసీయూలోకి అనుమతించని వైద్యులు
మరోవైపు, తారకరత్న పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితుల్లో... ఆయనను చూసేందుకు ఐసీయూలోకి కుటుంబ సభ్యులను కూడా వైద్యులు అనుమతించడం లేదు. ఇంకోవైపు, తారకరత్న వెంటిలేటర్ పై ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. తారకరత్న త్వరగా కోలుకుని ఇంటికి రావాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.