మీ భార్య అత్యంత అందమైన మహిళ అన్న నెటిజన్.. భారత టెన్నిస్ స్టార్ స్పందన వైరల్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో రన్నరప్ గా సానియా మీర్జా, రోహన్ బోపన్న
- స్టేడియంలో మ్యాచ్ వీక్షించిన ఇరువురి కుటుంబ సభ్యులు
- ప్రత్యేక ఆకర్షణగా బోపన్న భార్య సుప్రియ
అందంగా ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో, ఓ నెటిజన్ తను చూసిన అత్యంత అందమైన మహిళ బోపన్న భార్యనే అని ట్వీట్ చేశారు. దీనికి రోహన్ బోపన్న స్పందించారు. ‘నేను ఒప్పుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రియను ప్రేమించిన రోహన్ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది.