Advertisement

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ

Actors Vasishta Simha and Haripriya wed in Mysuru
  • కుటుంబ సభ్యుల సమక్షంలో మైసూరులో వివాహం
  • వారి పెళ్లి ఫొటోలను షేర్ చేసిన నటుడు ధనంజయ 
  • గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వశిష్ఠ-హరిప్రియ
కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య మీడియాకు దూరంగా మైసూరులో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లికి హాజరైన నటుడు ధనంజయ వారి పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హరిప్రియ ‘తకిట తకిట’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘పిల్ల జమీందర్’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జైసింహా’ వంటి సినిమాల్లో నటించారు. ఇక, ‘నారప్ప’ సినిమాతో తెలుగులో కనిపించిన కన్నడ నటుడు వశిష్ఠ సింహా ఆ తర్వాత ‘నయీం డైరీస్’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాల్లో నటించారు. కేజీఎఫ్‌లో ఆయన చేసిన కమల్ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
Advertisement
Vasishta Simha
Haripriya
Mysuru
Kanna
Sandalwood

More Telugu News