బీజేపీతో కలిసే ఉన్నాం.. బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాం: పవన్ కల్యాణ్
- ఎవరు కలిసొస్తే వారితో కలిసి ముందుకెళ్తామన్న పవన్
- కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని వ్యాఖ్య
- ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా వెళ్తామన్న జనసేనాని
విపక్షాలను అణచివేయడానికే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలనేదే తన కోరిక అని పవన్ చెప్పారు. ఓట్లను చీలనివ్వబోమని అన్నారు. రోజురోజుకు వైసీపీకి నమ్మకం సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు. అందుకే తన పర్యటనకు, నారా లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలను కలిగించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. 175 సీట్లలో గెలుస్తామని చెప్పుకునే వైసీపీకి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా జనసేన కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు.