కేరళ సర్కారు వినూత్న నిర్ణయం.. విద్యార్థినులకు ప్రత్యేక సెలవు
- రెండు శాతం అదనంగా మెనుస్ట్రువల్ లీవ్
- రెండు నెలల మేటర్నిటీ లీవ్
- కేరళ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో అమలు
కేరళ యూనివర్సిటీల్లో ప్రతి సెమిస్టర్ లోనూ విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ఇక దీనికి తోడు 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు రెండు నెలల మేటర్నిటీ లీవ్ ను కూడా ఇస్తున్నారు. ‘‘రెండు శాతం కండోనేషన్ మెనుస్ట్రువల్ లీవ్, రెండు నెలల మేటర్నిటీ లీవ్ ను యూనివర్సిటీల్లో విద్యార్థినులకు ఇవ్వాలని నిర్ణయించాం. యూనివర్సిటీలను మహిళల అనుకూల విద్యా కేంద్రాలుగా మార్చే చర్య ఇది’’ అని ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు తెలిపారు. ఈ నిర్ణయాలపై అక్కడి విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.