హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పిల్ బర్గ్ ను కలిసిన రాజమౌళి

Rajamouli met Steven Spielberg
  • లాస్ ఏంజెలెస్ లో యూనివర్సల్ పార్టీలో పాల్గొన్న రాజమౌళి
  • స్పిల్ బర్గ్ ని కలిసిన రాజమౌళి, కీరవాణి
  • ఇప్పుడే దేవుడిని కలిశానన్న రాజమౌళి
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కోసం దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా యూనివర్సల్ పార్టీలో రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పిల్ బర్గ్ ను వీరు కలిశారు. స్పిల్ బర్గ్ ను వీరు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వీరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రాజమౌళి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడే దేవుడిని కలిశానని ఆయన ట్వీట్ చేశారు. 

స్పిల్ బర్గ్ సినిమాలంటే తనకు ఎంత ఇష్టమో ఆయనకు చెప్పానని కీరవాణి తెలిపారు. 'నాటునాటు' పాట ఎంతో నచ్చిందని స్పిల్ బర్గ్ చెప్పిన మాటలను తాను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పారు. 

ఆస్కార్ అవార్డుల ఓటింగ్ లో భాగంగా లాస్ ఏంజెలెస్ లోని సన్ సెట్ టవర్స్ లో యూనివర్సల్ పార్టీ నిర్వహించారు. హాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. 'ఆర్ఆర్ఆర్' నుంచి నాటునాటు సాంగ్ ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇండియా నుంచి 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కు పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన చిత్రాలకు ఓటింగ్ నిర్వహించి, నామినేషన్స్ లో నిలిచిన చిత్రాలను ఈ నెల 24న ప్రకటిస్తారు. మార్చి 12న అవార్డుల ప్రదానం జరుగుతుంది.
Go Back to Shorts
Rajamouli
Keeravani
Steven Spielberg

More Telugu News